రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, తితిదే చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌తో పాటు అర్చక వర్గం ఇస్తికఫాల్ స్వాగతం పలికింది.
దర్శనం అనంతరం అర్చకులు వేదాశీర్వచనలు అందించి, తీర్థప్రసాదాలు సమర్పించారు. అనంతరం తితిదే చైర్మన్ బీఆర్ నాయుడు స్వామివారి చిత్రపటాన్ని రాష్ట్రపతికి అందించారు.
తర్వాత ఆలయం నుంచి పద్మావతి అతిథి గృహానికి వెళ్లే మార్గంలో, రాంభగీచ వసతిగృహం వద్ద వాహనం ఆపి భక్తులను పలకరించిన రాష్ట్రపతి, చిన్నారులకు చాక్లెట్లు పంచారు.



















