తుమ్మిసి పెద్ద చెరువులో నిర్వహించిన జలహారతి కార్యక్రమంలో నారా భువనేశ్వరి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతం అని ఆమె తెలిపారు. తాగునీరు మరియు సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కృష్ణా జలాలను కుప్పం ప్రాంతానికి తీసుకొచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని భువనేశ్వరి గారు పేర్కొన్నారు. కుప్పంలో నీటి కరువు లేకుండా చూసుకోవడం ఆయన ప్రధాన లక్ష్యమని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా రైతులకు సాగునీరు అందుబాటులో ఉండేలా చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని ఆమె గుర్తుచేశారు. కుప్పం అభివృద్ధి కోసం రూ. 23,000 కోట్లతో ఏడు ప్రధాన పరిశ్రమలను తీసుకురావడం జరిగింది. వాటిలో మూడు పరిశ్రమలు ప్రత్యేకంగా మహిళల సాధికారత కోసం ఏర్పాటు చేయడం విశేషమని తెలిపారు.
చంద్రబాబు నాయుడికి కుప్పం ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు భువనేశ్వరి గారు అన్నారు. పరిశ్రమల అభివృద్ధితో పాటు పర్యాటక అభివృద్ధి కూడా కుప్పం లో వేగంగా జరుగుతుందని పేర్కొన్నారు.





























