వివిధ కారణాల వల్ల కొందరు రాత్రిపూట భోజనం చాలా ఆలస్యంగా చేస్తుంటారు. కొంతమంది ఇంట్లో ఉండగా కూడా అర్ధరాత్రి వరకు భోజనం చేయక, టీవీ చూస్తూ, కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ సమయం గడుపుతారు. మరికొందరైతే ఫ్రెండ్స్‌తో చాట్ చేసుకుంటూ, మధ్యలో స్నాక్స్, బిస్కెట్లు తినిపోతారు. అలాంటి ఆలస్యం లేదా సమయపు భోజనం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాక, శరీరంలో అవసరంకాని కొవ్వులు, క్యాలరీలు చేరి బరువు పెరగడం, నిద్రలేమి వంటి సమస్యలు ఏర్పడే అవకాశముంది అని నిపుణులు సూచిస్తున్నారు.
రాత్రి ఆలస్యంగా తినకూడని కొన్ని ఆహార పదార్థాలు ఇవి:
తీపి పదార్థాలు:
నిద్ర వస్తుందనే అంచనాతో చాలామంది పడుకునే ముందు చాక్లెట్, ఐస్‌క్రీం, స్వీట్లు తినిపోతారు. కానీ చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు నిద్రను భంగపరచవచ్చు. కాబట్టి రాత్రిపూట తీపిపదార్థాలు తినకూడదు.
కొవ్వులు అధికంగా ఉన్నవి:
పిజ్జా, బర్గర్, ఐస్‌క్రీం, కేక్స్ వంటి పదార్థాలు ఎక్కువ కొవ్వులు కలిగివుండటం వలన కడుపు నిండుగా అనిపిస్తుంది. ఇది జీర్ణక్రియను మందగింపజేసి, మరుసటి రోజు ఉదయం అసౌకర్యంగా అనిపించవచ్చు. కాబట్టి రాత్రిపూట ఇలాంటి ఆహారాలు దూరంగా ఉండటం మంచిది.
కెఫీన్ అధికంగా ఉన్నవి:
కూల్‌డ్రింక్స్, నిమ్మపండు రసాలు వంటి ఆమ్లత ఎక్కువగా ఉన్న పదార్థాలు రాత్రిపూట తీసుకోకూడదు. ఇవి జీర్ణ సమస్యలకు దారితీస్తాయి. అలాగే, నైట్‌షిఫ్ట్‌లో పని చేసే కొందరు ఒత్తిడి, తలనొప్పి తగ్గించుకోవడానికి కాఫీ, టీ ఎక్కువగా తాగుతారు. ఇది కూడా ఆరోగ్యకరంగా కాదు. కాబట్టి వీటిని పదే పదే తాగకుండా జాగ్రత్త పెట్టాలి.
ప్రొటీన్లు ఎక్కువగా ఉన్నవి:
కొంతమంది రాత్రి పడుకునే ముందు చికెన్, మటన్ వంటి ప్రొటీన్లను ఎక్కువగా తింటారు. దీనివల్ల కడుపు నిండుగా అనిపించి అసౌకర్యం కలిగించవచ్చు. జీర్ణక్రియ కూడా సాఫీగా జరగక, అజీర్తి సమస్య ఏర్పడవచ్చు. అలాగే, ఎక్కువ మసాలా ఉన్న స్పైసీ ఆహారాలు రాత్రి తినకూడదు.
పండ్ల ఫ్లేవర్స్‌తో తయారైన పెరుగు:
చక్కెర ఎక్కువగా ఉండే ఈ రకమైన పెరుగు కూడా రాత్రి తినడం మంచిది కాదు. దానికంటే, ఇంట్లో తయారుచేసిన సాదాసీదా పెరుగు తీసుకోవడం ఉత్తమం.




















