ఒడిశాలో అమానుష ఘటన వెలుగుచూసింది. మేకను దొంగిలించారన్న అనుమానంతో ఇద్దరు బాలులను గ్రామస్థులు తాడుతో కట్టేసి దారుణంగా కొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మయూర్‌భంజ్ జిల్లా తిరింగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇందకోలి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం, రాయిరంగపూర్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని భూతుకబడి గ్రామానికి చెందిన సంబిత్ బిందాని (15) బైసింగిలో తన మామయ్య ఇంట్లో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అతను మరో బాలుడితో కలిసి మేకను దొంగిలించారని అనుమానించిన కొందరు గ్రామస్థులు వారిద్దరినీ పట్టుకుని తాడుతో కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించారు. అయితే సంబిత్ పరిస్థితి విషమించడంతో అతడిని రాయిరంగపూర్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరొక బాలుడు చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దాడికి పాల్పడిన వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామస్థుల ఈ దారుణ చర్యపై ప్రాంతంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















