సంప్రదాయ పద్ధతుల్లో ఉపాధ్యాయ ఉద్యోగాన్ని పొందడం ప్రస్తుత పరిస్థితుల్లో అంత సులభం కాదు. ప్రభుత్వ టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలవుతున్నప్పటికీ విపరీతమైన పోటీ ఉంటోంది. ప్రైవేటుగా ప్రయత్నించాలనుకుంటే ఆ రంగంలో ఉపాధ్యాయులకు ఉన్న ఒత్తిళ్లు అన్నీ ఇన్నీ కావు. ఈ నేపథ్యంలో బోధనపై ఆసక్తి ఉన్న వారికి ‘ఆన్‌లైన్ టీచింగ్’ సరైన కెరియర్. ఇక్కడ కేజీ నుంచి పీజీ వరకు అన్ని తరగతులకూ బోధించవచ్చు. జ్ఞానాన్ని భవిష్యత్తు తరాలకు ఆన్‌లైన్‌లో పంచే ఆ అద్భుత అవకాశాన్ని ఎలా అందిపుచ్చుకోవాలో తెలుసుకోడానికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి.




















