శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు, శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి దర్శనంతో పాటు తప్పక చూడాల్సిన మరో చారిత్రక స్థలం ఉంది – అదే ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం.
ఇక్కడి శివాజీ మందిరంతో పాటు పక్కనే ఉన్న ధ్యాన మందిరం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. శివాజీ రాజసాన్ని ప్రతిబింబించేలా నిర్మించిన భారీ బురుజులు, మధ్యలో కోట, అందులో విస్తారమైన విగ్రహం సందర్శకులను ఆకట్టుకుంటాయి.
ఈ ప్రదేశం కేవలం చరిత్రను మాత్రమే కాదు, శివాజీలోని ఆధ్యాత్మిక వైపును కూడా వెలికితీస్తుంది. 1677లో శివాజీ ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించి, ఆలయ ఉత్తర దిశలో ధ్యానం చేశారు. ఆ జ్ఞాపకార్థంగా ఆ ప్రదేశంలోనే ధ్యాన మందిరం నిర్మించబడింది.
ప్రస్తుతం ఈ స్ఫూర్తి కేంద్రాన్ని ఈ నెల 16న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సందర్శించనున్నారు.




















