నవీపేట: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం మిట్టాపూర్ శివారులో గుర్తు తెలియని మహిళను క్రూరంగా హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. బాసర ప్రధాన రహదారి పక్కన మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ప్రాథమిక వివరాల ప్రకారం, మృతురాలి వయసు 30 నుండి 40 ఏళ్ల మధ్యగా అంచనా. తల నరికి, చేతుల వేళ్లు తెగిపోయిన స్థితిలో మృతదేహం కనిపించింది. మహిళ వివస్త్రంగా ఉండటంతో, అత్యాచారం అనంతరం హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వేరే ప్రాంతంలో చంపి ఇక్కడకు తీసుకొచ్చి పడేసి ఉండవచ్చని వారు భావిస్తున్నారు.
ఘటనా స్థలాన్ని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించగా, క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.



















