నీట్ పునఃపరీక్ష భయంతో తమిళనాడులో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సేలం జిల్లా వెల్లాపురానికి చెందిన గోపిక గతంలో నీట్‌లో అర్హత సాధించలేకపోవడంతో ఈ ఏడాది మళ్లీ రాసింది. ప్రశ్నపత్రాల లీక్ నేపథ్యంలో నీట్ రద్దు కావడంతో ఈ నెల 21న జరగనున్న పునఃపరీక్షకు సిద్ధమవుతోంది. సరిగా రాయలేనని భయాందోళనకు లోనైన ఆమె శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కొంగణాపురం పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సేలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల కిందటే 20వ పుట్టినరోజు జరుపుకొన్న గోపిక ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా విషాదం నింపింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















