ఈనాడు డిజిటల్, శ్రీకాకుళం: విద్యను బోధించాల్సిన ఒక ఉపాధ్యాయురాలు విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగులోకి వచ్చింది. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూనే ఇద్దరు విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకుంటున్న ఆ ఉపాధ్యాయురాలి వీడియో ఆలస్యంగా బయటపడింది. ఈ ఘటనపై ‘ఈనాడు’ విచారణ జరిపినప్పుడు, ఐటీడీఏ సీతంపేట పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ మాట్లాడుతూ — సంబంధిత ఉపాధ్యాయురాలికి ఇప్పటికే షోకాజ్ నోటీసు జారీ చేసి, విచారణకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.




















