ఎర్రగుంట్ల, న్యూస్‌టుడే: మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్‌ను గెలుచుకోవడం, అందులో తమ కుమార్తె శ్రీచరణి భాగమవ్వడం పట్ల గర్వంగా ఉందని ఆమె తల్లిదండ్రులు నల్లపురెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, రేణుక తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్లలోని తమ ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి వారు ఆనందంగా మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం చంద్రశేఖర్‌రెడ్డి, రేణుక మాట్లాడుతూ — మొదట శ్రీచరణి అథ్లెటిక్స్‌లో ప్రతిభ కనబరిచిందని, తరువాత ఆమె మామయ్య కిషోర్‌కుమార్‌రెడ్డి ప్రోత్సాహంతో క్రికెట్‌లోకి ప్రవేశించి విజయాలను సాధిస్తున్నదని పేర్కొన్నారు.


















