విశాఖలో జరిగిన 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లు ప్రారంబించారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయెల్, రామ్మోహన్ నాయుడు, శ్రీనివాసవర్మ, పెమ్మసాని చంద్రశేఖర్ ఈ వేడుకకు హాజరై మరింత ప్రత్యేకత చేకూర్చారు. సదస్సులో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, సీఎస్ విజయానంద్, సీఐఐ అధ్యక్షుడు రాజీవ్ మెమానీ, సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పాల్గొన్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు కరణ్ అదానీ, యూసఫ్ అలీ, బాబా కల్యాణి తదితరులు విశిష్ట అతిథులుగా విచ్చేయగా, దేశ–విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు, పరిశ్రమల నాయకులు, పెట్టుబడిదారుల హాజరుతో వేదిక సందడిగా మారింది.


















