ప్రజల్లో సానుకూల దృక్పథం, సంతృప్త స్థాయిని పెంపొందించే విధంగా ప్రభుత్వ శాఖలు పనిచేయడం అత్యంత అవసరం. ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదు. టెక్నాలజీ ఆధారిత ఆడిటింగ్‌తో పాటు అధికారుల ప్రవర్తనలో మార్పు వస్తేనే ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరుగుతుంది. వచ్చే మూడు నెలల్లో అన్ని విభాగాలు కనీసం 80 శాతానికి పైగా ప్రజల్లో సంతృప్తిని సాధించాలి. ఈ సమయంలో మంత్రులు, ఉన్నతాధికారులు పౌరసేవలను మరింత మెరుగుపరిచే దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా సేవల డెలివరీనే సమస్యగా ఉంది కాబట్టి, మూడు నెలల్లో పనితీరు పూర్తిగా మెరుగుపరచాలి. సేవలతో పాటు ప్రజల్లో అవగాహనను కూడా కల్పించడం అవసరం. ఎందుకంటే ప్రజలు సంతృప్తిగా లేకపోతే బంగారం ఇస్తేను, ఆ ప్రయత్నానికి లాభం ఉండదు. అందరూ కలిసి పని చేస్తే మూడు నెలల్లో విప్లవాత్మకమైన మార్పులు సాధించడానికి అవకాశం ఉంది.



















