సాధారణంగా అందరూ ఎడమ నుంచి కుడివైపు రాయడం సహజం. కానీ అనకాపల్లి జిల్లా నర్సీంపట్నానికి చెందిన మామిడి రమ్య మాత్రం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వంటి భాషల్లో కుడి నుంచి ఎడమకు రాస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ‘మిర్రర్ రైటింగ్’లో నైపుణ్యం సాధించిన ఆమె, ఏకంగా 135 భాషల్లో ‘వందేమాతరం’ను అద్దం లిపిలో రాసి కొత్త రికార్డు నెలకొల్పింది. ఈ ప్రతిభతో అనేక అవార్డులు, ప్రపంచ రికార్డులను కూడా సొంతం చేసుకుంది రమ్య. ఆమె గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో చూద్దాం




















