ఓ ఫ్యాన్సీ షాప్ యజమాని జీవితం నేడు కన్నీటి కథగా మారింది. ఏళ్ల తరబడి ఎంతో కష్టపడి నిర్మించుకున్న తన వ్యాపార సముదాయంలోకే తనను రానీయకుండా కన్న కొడుకే అడ్డుకుంటూ, గెంటేస్తున్న పరిస్థితి ఆ తండ్రిని తీవ్ర మానసిక వేదనకు గురిచేస్తోంది.
తండ్రిగా ప్రేమతో, బాధ్యతగా కుటుంబాన్ని నిలబెట్టిన ఆయనకు ఇప్పుడు అదే కుటుంబం నుంచి అవమానం ఎదురవుతుండటం కలచివేస్తోంది. ఈ విషయంలో ప్రశ్నిస్తే దాడికి కూడా దిగుతున్నాడని బాధిత తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



















