ఇస్రోకు చెందిన ISRO Propulsion Complex (ఐపీఆర్సీ)లో తాత్కాలిక ప్రాతిపదికన 22 పోస్టుల భర్తీకి అవకాశం వచ్చింది. విద్యార్హతను బట్టి పదో తరగతి, ఐటీఐ లేదా డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అత్యధికంగా టెక్నీషియన్-బీ పోస్టులు 13 ఉండగా.. టెక్నికల్ అసిస్టెంట్ 5, ఫైర్మన్-ఏ 3 పోస్టులు ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధిత ఇంజినీరింగ్ విభాగాల్లో ప్రథమ శ్రేణి డిప్లొమా అవసరం. ఈ పోస్టులకు ఎంపికైనవారికి రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు వేతన శ్రేణి ఉంటుంది.
టెక్నీషియన్-బీ పోస్టులకు పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ అర్హత ఉండాలి. ఈ పోస్టులకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు వేతన శ్రేణి ఉంది. ఫైర్మన్-ఏ పోస్టులకు పదో తరగతి అర్హతతో పాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు, వైద్య పరీక్షల్లో అర్హత సాధించాల్సి ఉంటుంది.
టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్-బీ పోస్టులకు ఓఎంఆర్ విధానంలో రాత పరీక్ష నిర్వహించి, అనంతరం స్కిల్ టెస్టు నిర్వహిస్తారు. ఫైర్మన్ పోస్టులకు రాత పరీక్షతో పాటు ఫిజికల్ ఫిట్నెస్, స్కిల్ టెస్టులు ఉంటాయి. అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు వయసు, విద్యార్హతలు, శారీరక ప్రమాణాలు, ఫీజు తదితర నిబంధనలను అధికారిక నోటిఫికేషన్లో పరిశీలించాలి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















