తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం పరిసర ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం కారణంగా పలు కాలనీలు నీటమునిగాయి. ఈ పరిస్థితిని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు స్వయంగా పరిశీలించారు. బాధితులను పరామర్శిస్తూ, అవసరమైన సదుపాయాలు అందించే వరకు ప్రభుత్వం తరఫున భోజన సదుపాయం కొనసాగుతుందని ఆయన తెలిపారు.
మద్దిపాటి మాట్లాడుతూ – “తుఫాన్ వల్ల పంటలు, ఇళ్లు నష్టపోయిన ప్రతి రైతు, కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పరిస్థితి పూర్తిగా సాధారణం అయ్యే వరకు మేము ప్రజలతో ఉంటాం” అని చెప్పారు.
తుఫాన్ తీరం దాటిన తర్వాత కురిసిన భారీ వర్షాల కారణంగా నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలు నీటమునిగాయి. అయితే, సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల వలన దేవరపల్లి ప్రాంతంలో వరద ముంపు బాధ తక్కువగా ఉండిందని ఎమ్మెల్యే తెలిపారు.
రైతుల సమస్యలను గుర్తించి, త్వరితగతిన పునరావాస చర్యలు చేపడతామని, అవసరమైన సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.






















