హై బీపీ.. ప్రస్తుతం ఈ సమస్య అందరిని ఇబ్బంది పెడుతోంది. వైద్యులు వద్దకు వెళ్లితే.. భారీగా ఫీజు వసూల్ చేస్తున్నారు. దీనితోపాటు అత్యంత ఖరీదైన మందులు రాస్తున్నారు. దీంతో సామాన్య మానవులు తట్టుకోలేక పోతున్నారు. అలాంటి వేళ.. హై బీపీ నియంత్రణకు ఇంట్లోనే సింపుల్ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
ప్రస్తుతం హై బీపీ సమస్య అందరిని ఇబ్బంది పెడుతోంది. వైద్యులు వద్దకు వెళ్లితే.. భారీగా ఫీజు వసూల్ చేస్తున్నారు. దీనితోపాటు అత్యంత ఖరీదైన మందులు రాస్తున్నారు. దీంతో జేబుకు చిల్లు.. అది కూడా గట్టిగా పడుతుంది. అయితే ఇంట్లోనే మనం తినే.. తీసుకునే ఆహారంలో కొద్ది పాటు మార్పులు చేర్పులతో ఈ హై బీపీ సమస్యను దాదాపుగా నియంత్రించువచ్చని వైద్యులు సూచిస్తున్నారు. అందుకు ఆరు చక్కటి పరిష్కారాలను వారు సోదాహరణగా వివరిస్తున్నారు.
మొదటిది.. కీర దోసకాయ.. బీపీని నియంత్రించడానికి ఇది చాలా బాగా పని చేస్తుంది. కేజీ కీర దోసకాయ ఖరీదు చాలా స్వల్పంగానే ఉంటుందన్న విషయం అందరికి తెలిసిందే. వీటిని రోజు తీసుకోవడం ద్వారా సులభంగా హై బీపీని నియంత్రివచ్చు.
రెండోవది.. రాతి ఉసిరి (ఆమ్లా).. ఇందులో ఎన్నో పోషకాలతోపాటు విటమిన్లు సైతం ఉంటాయి. ఇది సహజ సిద్ధంగా లభిస్తుంది. అంతేకాకుండా దీని వల్ల అనేక ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి. ఇది శరీరాన్ని పూర్తిగా శుభ్రం చేస్తుంది. అంటే శరీరంలోని విషాన్ని పూర్తిగా తొలగించే శక్తి.. ఈ రాతి ఉసిరికి ఉంది. ఈ రాతి ఉసిరి.. షుగర్, హై బీపీలను తగ్గించడమే కాకుండా బరువు తగ్గడంలో సైతం కీలకంగా వ్యవహరిస్తోంది.
మూడోవది అన్ని కూరగాయలు.. మరి మఖ్యంగా బెల్ పెప్పర్స్ (సిమ్లా మిర్చి). ఇందులో రంగులు ఉంటాయి. అంటే పసుపు, ఎరుపు, పచ్చని క్యాప్సికమ్ మిర్చి లభిస్తుంది. ఏ రంగులో ఉన్న ఈ మిర్చి తీసుకున్నా.. బీపీ మాత్రం నియంత్రణలోకి వస్తుంది. అలాగే క్యారెట్ సైతం బీపీ తగ్గడానికి సహాయపడుతుంది.
నాలుగోది.. ముల్లంగి (ర్యాడిష్) ఇది కొద్దిగా ఘాటుగా ఉంటుంది. అందుకే దీనిని తినడానికి ఎవరూ అంతగా ఇష్టపడరు. కానీ దీనిని కూరగా చేసుకుని తీసుకుంటే మాత్రం చాలా మంచిది.
ఐదోవది.. మజ్జిగ (బటర్ మిల్క్): చాలా పల్చగా చేసుకుని మజ్జిగ తాగాలి. అందులో కొద్దిగా జీలకర్ర పొడితోపాటు సొంపు పొడి వేసుకుని తీసుకుంటే వెంటనే రిలీఫ్ ఉంటుంది. పేగులు సైతం ఆరోగ్యంగా ఉంటాయి.
ఆరోవది.. రాత్రి సమయంలో గ్లాస్ వాటర్ తీసుకోవాలి. టీ స్పూన్ సొంపు, జీలకర్ర, ఒక దాల్చిన చెక్కను నీటిలో వేసి నానబెట్టాలి. ఉదయం అందులో పొదీనా వేయాలి. ఈ మిశ్రమంలో ఆఫ్ టీ స్ఫూన్ ములగాకు పొడి కూడా వేసి బాగా మరిగించాలి. అనంతరం వడ పోసుకుని.. అందులో నిమ్మకాయ పిండుకుని తాగితే.. బీపీ వెంటనే కంట్రోల్ అవుతుంది. ఇది క్రమం తప్పకుండా ప్రతి రోజు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.




















