రవితేజ హీరోగా కొత్త దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మాస్ జాతర’ (Mass Jathara). శ్రీలీల హీరోయిన్. ఈ సినిమా కొత్త విడుదల తేదీ బుధవారం ఖరారైంది. ఈ నెల 31న రిలీజ్ చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు స్పెషల్ వీడియో పంచుకుంది. ఈ సినిమా పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. దాన్ని గుర్తుచేస్తూ.. ఈ సినిమా విడుదల ఇంకెప్పుడు? అని హైపర్ ఆది అడగటం.. రవితేజ చివరకు అక్టోబరు 31 అని చెప్పడం వీడియోలో కనిపించింది. ఈ హంగామా మీరూ చూసేయండి.


















