ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

నిత్య పూజ ఎవరు చేయాలి

October 29, 2025
in Devotional News
0
నిత్య పూజ ఎవరు చేయాలి
Share on FacebookShare on TwitterShare on Whatsapp

💫 సాధారణంగా నిత్య పూజ చేయడం అనేది పురుషుడు చేస్తాడు. ఎవరు చేయాలి అంటే యజమాని నిత్యపూజ చేయాలి.

🌈 సంకల్పంలోనే ఉంది ‘ధర్మపత్నీ సమేతస్య’ అని ఉంది. కానీ ‘పతీసమేతస్య’ అని లేదు. అంటే దాని అర్థం ఇంట్లో పూజ ఇంటి యజమాని చేయాలి. ఇల్లు అభివృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకోవాలి.

💫 పురుషుడు ప్రతిరోజూ పూజ చేస్తాడు. నైమిత్తిక తిథులలో పూజ చేసేటప్పుడు భార్య కూడా ప్రక్కన కూర్చుంటుంది. ‘వినాయక వ్రతం’ లాంటిది చేసినప్పుడు.

🌈 వస్త్రధారణా నియమం అన్నప్పుడు – ప్రధానంగా ఆడపిల్ల అయితే లంగా వోణీ వేసుకుంటుంది, వివాహిత అయితే చీర కట్టుకుంటుంది. అమ్మవారికి అవే కదా ప్రధానం. కాబట్టి మనం కూడా అవే కట్టుకుంటాం.

💫 ఇక పురుషులకు సంబంధించి వేదం ఒక మాట చెప్పింది –

‘వికచ్ఛః అనుత్తరీయశ్చ, నగ్నశ్ఛావస్త్ర ఏవచ’ –

గోచీ పోయకుండా కేవలం బట్టను చుట్టు మాత్రమే తిప్పి కట్టడం దిగంబరుడే అవుతుంది. బట్ట గోచీ పోయాలి. వెనక్కి తీసి కుచ్చిళ్ళు పోసి గోచీ వెనక్కి దోపుకోవాలి. దానిని ‘కచ్ఛము’ అంటారు. ‘వికచ్ఛః’- గోచీ పెట్టుకోలేదు; అనుత్తరీయశ్చ – పైన ఉత్తరీయం లేదు; అంటే ఉత్తరీయం ఒక్కటే ఉండాలి పురుషుడికి. చొక్కా కానీ, బనీను కానీ ఏదీ ఉండ కూడదు పూజ చేసేటప్పుడు.

💫 దేవాలయంలోనైనా అంతే. భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షిస్తున్నావు. నీ గుండెలలో ఏ పరమాత్మ ఉన్నాడో వాడే ఎదురుగుండా ఉన్నాడు. వాడు వీడికి, వీడు వాడికి కనపడాలి. ఉత్తరీయం ఒక్కటే వేసుకుంటారు. గోచీపోసి పంచె కట్టుకోవాలి.

🌈 ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉంటే వాడు భార్యా సహితుడు, మంగళప్రదుడు అని గుర్తు.

💫 కుడి భుజంమీద ఉత్తరీయం వేసుకుంటే భార్య చనిపోయింది. అమంగళకరుడు. యజ్ఞయాగాది క్రతువులకు పనికి రాడు అని గుర్తు.

🌈 అసలు ఉత్తరీయం వేసుకోకపోతే పూజకు అర్హుడు కాదు అని గుర్తు. కాబట్టి ఉత్తరీయం లేకుండా ఉండకూడదు.

💫 ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తున్నారు అనుకోండి నీయందు పెద్దరికం వాళ్ళు చూస్తున్నారు అనడానికి గుర్తు స్వాగతం చెప్పడానికి ఇంటి బయటికి వచ్చిన ఇంటి యజమాని ఎడమభుజం మీద ఉత్తరీయం ఉన్నదా లేదా అన్నది చూసుకోవాలి.

🌈నేను ఎవరి ఇంటికైనా వెళ్ళాను అనుకోండి, ఆయన ఎడమ భుజం మీద ఉత్తరీయం వేసుకుని ఎదురు వచ్చి స్వాగతం పలికాడు అనుకోండి ఆయన అభ్యున్నతి కొరకు మంచిమాటలు చెప్పవచ్చు. ఆయన అలా రాలేదు అనుకోండి నాపని చూసుకుని వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే నాకు అయన పెద్దరికం అనడానికి గుర్తు ఏమిటంటే భుజం మీద ఉత్తరీయంతో స్వాగతం పలకాలి.

🌈 మీరు గమనించండి కావ్యాలలో, పురాణాలలో భుజం మీద ఉత్తరీయంతో స్వాగతం పలికాడు అని ఉంటుంది. అప్పుడే పెద్దలు మాట్లాడతారు. కాబట్టి ఉత్తరీయం ఉండాలి. నువ్వు భగవంతుడితో సమన్వయము అవుతున్నావు ఆయన చేయి చాపాలి, కాళ్ళు చాపాలి, ఆయన తింటే కదూ నువ్వు పెట్టింది అందింది. ఆయన అనుగ్రహించాలంటే నువ్వు మంగళప్రదుడివై అయి ఉండాలి. ఉత్తరీయం వేసుకుని ఉండాలి.

💫‘అనుత్తరీయశ్చ, నగ్నశ్చ – వాడు బట్టలు లేకుండా పూజ చేశాడు అని గుర్తు. ‘అవస్త్రఏవచ’ – మళ్ళీ నొక్కి చెప్పింది వేదం. వాడు నగ్నంగా ఉన్నాడు. నగ్నము అన్నమాటకు అర్థం అంటే దిక్కులు కప్పని వాడై ఉన్నాడు. ఒక చుట్టు చుట్టి కట్టాను అనుకోండి పూజకు పనికిరాను. గోచీపోసి కట్టే కూర్చోవాలి. అందుకే వేదం చదువుకున్న పెద్దలు, వాళ్ళు భోజనం చేస్తుంటే కనీసం అంగవస్త్రం అంటారు చిన్న గుడ్డ అయినా సరే గోచీ పోసుకుని కూర్చుని భోజనం చేస్తారు తప్ప అసలు వికచ్ఛంగా భోజనం చేయరు. వికచ్ఛంగా పూజ దగ్గరికి వెళ్ళరు. దేవాలయంలో అంతరాలయ ప్రవేశం చేయరు.

🌈 అలా పంచె కట్టుకునేటప్పుడు ఆ పంచెకి కానీ, ఉత్తరీయానికి కానీ అంచు ఉండాలి. అంచు లేని బట్ట కట్టాడు అంటే అమంగళప్రదుడు అని గుర్తు. అవతలి వాడు పదికాలాలు బ్రతకాలి అని కోరుకుంటే అంచు ఉన్న బట్టలు తీసుకువచ్చి పెడతారు. ఒక ప్యాంటు గుడ్డ నేను పెట్టాను అనుకోండి, దానికి అంచు ఉండదు. అందుకే పీటలమీద అల్లుడికి పెట్టాలి అంటే నీకు కోటు కుట్టించాలి అని మోజు ఉంటే బయట కుట్టించు. పీటల మీద కూర్చున్నాడు భగవత్ కార్యంలో… ఆయుఃకారకం నువ్వు ఇచ్చేది. నువ్వు ఉత్తరీయం వేసుకోవాలి.
ఉత్తరీయం లేకుండా బట్టలు పెట్టకూడదు. ఉత్తరీయం లేకుండా బట్టలు పుచ్చుకోకూడదు. అంచు ఉన్న బట్టలు పెట్టాలి. అందుకే ఇప్పటికీ మనవాళ్ళు పంచెల చాపు పెడతారు. పరమ మంగళప్రదుడు అనడానికి గుర్తు అంచు ఉన్న బట్ట గోచీ పోసుకుని కట్టుకుని ఉత్తరీయం వేసుకుని ఉంటే పరమ మంగళప్రదుడు. శౌచంతో ఉన్నాడు అని గుర్తు. పూజ దగ్గరికి వెళితే లాల్చీ, బనియను కూడా పనికిరావు. తీసేసి ఉత్తరీయం కప్పుకుని గోచీ పోసి పంచె కట్టుకుని కూర్చుని పూజ చేయాలి. గోచీ ఎంత బాగా పోయాలి. అంచు ఎంత బాగా మడత పెట్టాలి సంబంధం లేదు.

Tags: DevotionNitya Pooja
ShareTweetSend
Previous Post

వెలిగొండ ప్రాజెక్ట్: వరదలో చిక్కుకున్న 200 మంది కార్మికులు సురక్షితం

Next Post

తమిళనాడు: “విజయ్ పంపిన రూ.20 లక్షలు మాకు అవసరం లేదు” – మృతుల కుటుంబం తిరస్కరణ

Related Posts

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
Devotional News

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

September 15, 2026
Happy Vinayaka Chavithi!
Andhra Pradesh News

Happy Vinayaka Chavithi!

September 14, 2026
వినాయక చవితి శుభాకాంక్షలు!
Andhra Pradesh News

వినాయక చవితి శుభాకాంక్షలు!

September 14, 2026
భక్తుల నుంచి ఉద్యోగుల వరకు.. తితిదే పాలక మండలి కీలక నిర్ణయాలు
Devotional News

భక్తుల నుంచి ఉద్యోగుల వరకు.. తితిదే పాలక మండలి కీలక నిర్ణయాలు

September 9, 2026
భద్రాద్రి రామయ్య సన్నిధిలో కేంద్రమంత్రి బండి సంజయ్‌
Devotional News

భద్రాద్రి రామయ్య సన్నిధిలో కేంద్రమంత్రి బండి సంజయ్‌

September 9, 2026
తిరుపతి నుంచే బ్రహ్మోత్సవ శోభ.. భక్తులకు ఆధ్యాత్మిక స్వాగతం!
Devotional News

తిరుపతి నుంచే బ్రహ్మోత్సవ శోభ.. భక్తులకు ఆధ్యాత్మిక స్వాగతం!

September 8, 2026
Next Post
తమిళనాడు: “విజయ్ పంపిన రూ.20 లక్షలు మాకు అవసరం లేదు” – మృతుల కుటుంబం తిరస్కరణ

తమిళనాడు: “విజయ్ పంపిన రూ.20 లక్షలు మాకు అవసరం లేదు” – మృతుల కుటుంబం తిరస్కరణ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 15, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 15, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 15 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

పంచాంగం: 15 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

September 15, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
మహిళా బైకర్‌ను కారుతో ఢీకొట్టిన ఘటన.. నిందితుడి అరెస్టు

మహిళా బైకర్‌ను కారుతో ఢీకొట్టిన ఘటన.. నిందితుడి అరెస్టు

September 15, 2026
రూ.3,300 కోట్ల ఆస్తి.. ముంబయి వీధుల్లో భిక్షగాడిగా బీజేపీ ఎమ్మెల్యే

రూ.3,300 కోట్ల ఆస్తి.. ముంబయి వీధుల్లో భిక్షగాడిగా బీజేపీ ఎమ్మెల్యే

September 15, 2026
చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్‌.. భారత్‌కు నేరుగా రిపోర్ట్‌ చేయనున్న మెటా

చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్‌.. భారత్‌కు నేరుగా రిపోర్ట్‌ చేయనున్న మెటా

September 15, 2026
కేటీఆర్‌ సిబ్బందిపై దాడి ఆరోపణలు.. ఖండించిన సైఫాబాద్‌ పోలీసులు

కేటీఆర్‌ సిబ్బందిపై దాడి ఆరోపణలు.. ఖండించిన సైఫాబాద్‌ పోలీసులు

September 15, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

మహిళా బైకర్‌ను కారుతో ఢీకొట్టిన ఘటన.. నిందితుడి అరెస్టు

మహిళా బైకర్‌ను కారుతో ఢీకొట్టిన ఘటన.. నిందితుడి అరెస్టు

September 15, 2026
రూ.3,300 కోట్ల ఆస్తి.. ముంబయి వీధుల్లో భిక్షగాడిగా బీజేపీ ఎమ్మెల్యే

రూ.3,300 కోట్ల ఆస్తి.. ముంబయి వీధుల్లో భిక్షగాడిగా బీజేపీ ఎమ్మెల్యే

September 15, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.