మహారాష్ట్రలోని ఘాట్కోపర్ ఈస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే, వ్యాపారవేత్త పరాగ్ షా ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. సుమారు రూ.3,300 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న ఆయన ముంబయి వీధుల్లో భిక్షమెత్తుకుంటూ కనిపించిన వీడియోలు వైరల్‌గా మారాయి. దీంతో ఆయన పరిస్థితి ఏమిటంటూ పలువురు ఆశ్చర్యానికి గురయ్యారు.
అయితే పరాగ్ షా ఆర్థిక ఇబ్బందుల కారణంగా భిక్షాటన చేయలేదు. తన ఆధ్యాత్మిక గురువు సూచన మేరకు జైన సంప్రదాయంలోని ప్రత్యేక మాసంలో భాగంగా ఒకరోజు దీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా తనను ఎవరూ గుర్తుపట్టకుండా వేషధారణ మార్చుకుని ఘాట్కోపర్ ఈస్ట్ నియోజకవర్గంలోని వీధుల్లో తిరిగారు.
ఆ రోజు తనకు లభించిన ఆహారాన్నే స్వీకరించి, సాధారణ వ్యక్తిలా జీవించారు. రాత్రి రోడ్లపైనే నిద్రించారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజల నుంచి లభించే గౌరవం, భిక్షగాడి రూపంలో అదే ప్రజల వద్దకు వెళ్లినప్పుడు ఎదురైన అనుభవం పూర్తిగా భిన్నంగా ఉందని పరాగ్ షా తెలిపారు.
ఎమ్మెల్యేగా ప్రజలు తనను గౌరవంగా పలకరిస్తారని, కానీ భిక్షగాడి రూపంలో వెళ్లినప్పుడు అదే వ్యక్తులు తనకంటే ఉన్నతంగా కనిపించారని ఆయన పేర్కొన్నారు. మనం ప్రపంచాన్ని చూసే విధానంలోనే అనేక విషయాలు ఆధారపడి ఉంటాయని, ఈ అనుభవం తనకు జీవితంపై కొత్త అవగాహన కల్పించిందని చెప్పారు.
అంతేకాకుండా ముంబయి ప్రజల్లోని దాతృత్వం, సహాయ గుణాన్ని దగ్గరగా తెలుసుకునే అవకాశం ఈ దీక్ష ద్వారా లభించిందని పరాగ్ షా వెల్లడించారు. సంపద, పదవి, హోదాలకు అతీతంగా సాధారణ జీవితాన్ని అనుభవించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రత్యేక దీక్ష చేపట్టినట్లు ఆయన వివరించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















