ఛత్తీస్‌గఢ్‌లోని నవ రాయపుర్‌లో నిర్మించిన కొత్త అసెంబ్లీ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఇది రాష్ట్ర అభివృద్ధి జర్నీలో స్వర్ణయుగానికి ఆరంభం” అని అభివర్ణించారు.
తన రాజకీయ జీవితం తీర్చిదిద్దడంలో ఛత్తీస్‌గఢ్ ప్రజల ఆశీర్వాదం ఎంతో ముఖ్యమని గుర్తుచేసుకున్నారు. “ఛత్తీస్‌గఢ్‌తో నాకు ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకం. నా కెరీర్ రూపుదిద్దుకోవడంలో ఈ నేల, ఈ ప్రజల ఆశీర్వాదం కీలక పాత్ర పోషించింది” అని మోదీ అన్నారు.
భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని, ఈ సంవత్సరం దేశానికి ‘అమృత మహోత్సవం’గా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ రచనలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పలువురు నేతలు కీలక పాత్ర పోషించారని, వారిని స్మరించుకోవడం గర్వకారణమని తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని కూడా మోదీ ఆవిష్కరించారు. “వాజ్‌పేయిజీ విజన్ వల్లే 25 ఏళ్ల క్రితం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం అవతరించింది. ఆయన కలల రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధిలో కొత్త దశలోకి అడుగేస్తోంది” అని ప్రధాని అన్నారు.
51 ఎకరాల విస్తీర్ణంలో రూ.324 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ కొత్త అసెంబ్లీ భవనం, ఛత్తీస్‌గఢ్ సాంస్కృతిక వైభవం మరియు ప్రగతిశీల స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తుందని ప్రభుత్వం ప్రకటించింది.
ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ స్పీకర్ రమణ్ సింగ్, ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, విపక్ష నేత చరణ్‌దాస్ మహంత తదితరులు పాల్గొన్నారు.



















