కావలసిన పదార్థాలు:
- ఇడ్లీ పిండి – 1 కప్పు
- మైదా – ¼ కప్పు
- ఉప్పు – తగినంత
- వంట సోడా – ¼ టీస్పూన్
- వెల్లుల్లి కారం లేదా కూరల్లో వేసే కారం – రుచికి తగినంత
- నెయ్యి – తగినంత
- నూనె – వేయించడానికి సరిపడా
తయారీ విధానం:
- ఒక గిన్నెలో ఇడ్లీ పిండి, మైదా, ఉప్పు, వంట సోడా వేసి బాగా కలపండి.
- పిండి మృదువుగా ఉండేలా కొద్దిగా నీరు వేసి కనీసం 5 నిమిషాలు కలుపుతూ ఉండండి.
- దీని వల్ల పునుగులు గట్టిగా కాకుండా ఉంటాయి.
- మిశ్రమాన్ని మూతపెట్టి 5 నిమిషాలు పక్కన పెట్టండి.
- కడాయిని స్టవ్ మీద పెట్టి, మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి తగినంత నూనె వేసి వేడి చేయండి.
- నూనె వేడి అయ్యేలోగా మిశ్రమాన్ని మరోసారి కలిపి, కొద్దిగా కొద్దిగా కడాయిలో పునుగులుగా వేయండి.
- రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
- వేగిన పునుగులను టిష్యూ పై ఉంచి అదనపు నూనె తొలగించండి




















