విశాఖ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ.. గురువారం తెల్లవారుజామున వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అక్టోబర్ 3న దక్షిణ ఒడిశా – ఉత్తర కోస్తాల మధ్య తీరం దాటనుంది. ఈ కారణంగా ఇవాళ కోస్తాంధ్ర, తెలంగాణకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గురువారం, శుక్రవారం తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్పారు. రాగల మూడు రోజులు తీరం వెంబడి ౩౦ కిలోమీటర్లకు పైగా వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు.



















