టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్‌పై రష్యా తీవ్ర ఆరోపణలు చేస్తూ కీలక చర్యలు చేపట్టింది. రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (FSB) దురోవ్‌ను అంతర్జాతీయ మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చినట్లు ప్రకటించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు టెలిగ్రామ్ వేదికగా మారుతున్నప్పటికీ, వాటిని అడ్డుకోవడంలో సంస్థ యాజమాన్యం విఫలమైందని రష్యా ఆరోపించింది.
ఉక్రెయిన్‌కు చెందిన ఉగ్రవాద, తీవ్రవాద సంస్థలు టెలిగ్రామ్ ఛానళ్లు, చాట్‌లను విధ్వంసక చర్యలకు ఉపయోగిస్తున్నాయని రష్యా పేర్కొంది. ఈ వ్యవహారంలో పావెల్ దురోవ్‌పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించింది. అయితే, ఈ ఆరోపణలపై దురోవ్ గతంలో తీవ్రంగా స్పందించారు. టెలిగ్రామ్‌లో వ్యక్తిగత గోప్యత, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అణచివేసేందుకు రష్యా తనపై తప్పుడు కేసులు పెడుతోందని ఆయన విమర్శించారు.
ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా దేశంలో ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలపై నియంత్రణలను మరింత కఠినతరం చేసింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వంటి పలు అంతర్జాతీయ వేదికలపై ఆంక్షలు విధించగా.. వాట్సాప్, టెలిగ్రామ్ సేవలపైనా పరిమితులు విధించినట్లు సమాచారం. అదే సమయంలో దేశీయంగా అభివృద్ధి చేసిన ‘మ్యాక్స్ (MAX)’ మెసేజింగ్ యాప్‌ను ప్రోత్సహిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో టెలిగ్రామ్ వ్యవస్థాపకుడిపై రష్యా తీసుకున్న తాజా చర్య అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews
















