ఆషాఢ శుద్ధ చతుర్దశిని పురస్కరించుకుని విశాఖపట్నం జిల్లా సింహాచలం క్షేత్రంలో గిరి ప్రదక్షిణ మహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సింహాచలం ఆలయ అనువంశిక ధర్మకర్త, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు కొండ దిగువన తొలి పావంచా వద్ద జెండా ఊపి పుష్పరథాన్ని ప్రారంభించడంతో గిరి ప్రదక్షిణ అధికారికంగా మొదలైంది.
సింహాద్రి అప్పన్న స్వామి ప్రతిరూపం కొలువుదీరిన పుష్పరథం గిరి పరిక్రమకు బయలుదేరగా, పెద్ద సంఖ్యలో భక్తులు రథాన్ని అనుసరించారు. గోవింద నామస్మరణలు, మంగళవాయిద్యాలు, జానపద కళారూపాల ప్రదర్శనలతో సింహాచలం క్షేత్రం ఆధ్యాత్మిక సందడితో మార్మోగింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















