ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ10 నిందితుడిగా ఉన్న సైఫ్ అహ్మద్ విజయవాడ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. కేసు నమోదైన తర్వాత విదేశాలకు వెళ్లిపోయిన ఆయన.. ప్రస్తుతం కోర్టు ఎదుట లొంగిపోయేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
లిక్కర్ స్కామ్‌లో ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న రాజ్‌కెసిరెడ్డికి సైఫ్ అహ్మద్ ప్రధాన అనుచరుల్లో ఒకరిగా ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించిన నగదు లావాదేవీల్లో ఆయన కీలక పాత్ర పోషించినట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉన్న సైఫ్ అహ్మద్ స్వయంగా కోర్టులో లొంగిపోవడానికి సిద్ధమవుతూ పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
సైఫ్ అహ్మద్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు తదుపరి విచారణలో నిర్ణయం తీసుకోనుంది. కోర్టు ఆయన అభ్యర్థనను ఏ విధంగా పరిగణనలోకి తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామంతో ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews















