పోలవరం జిల్లా ఈర్లపల్లికి చెందిన పదో తరగతి విద్యార్థిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శివాని మృతి తనను తీవ్ర విషాదంలోకి నెట్టేసిందని పేర్కొన్నారు. రంపచోడవరంలో నిర్వహించిన మెగా పీటీఎంలో శివాని ఎంతో ఉత్సాహంగా పాల్గొని తన చదువు, భవిష్యత్తు లక్ష్యాల గురించి మాట్లాడిన విషయాలను సీఎం గుర్తుచేసుకున్నారు.
చిన్న వయసులోనే ఎంతో భవిష్యత్తు ఉన్న గిరిజన విద్యార్థిని ఇలా తనువు చాలించడం తనను తీవ్రంగా కలచివేసిందని చంద్రబాబు తెలిపారు. శివాని తనతో చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయని, ఆమె కలలు సాకారం కాకముందే జీవితాన్ని ముగించడం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. విద్యార్థిని మృతికి దారితీసిన పరిస్థితులు ఏవైనా.. ఇలాంటి విషాద ఘటనలు జరగకుండా పిల్లలకు కుటుంబం, పాఠశాల, సమాజం నుంచి తగిన మద్దతు, భరోసా అందాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















