ది రాజాసాబ్’లో బొమన్ ఇరానీ పాత్ర కీలకమని దర్శకుడు మారుతి తెలిపారు. ఆయన పాత్ర ప్రవేశంతో సినిమా టోన్ పూర్తిగా మారిపోతుందని చెప్పారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ పాన్ ఇండియా చిత్రంలో బొమన్ ఇరానీ సైకియాట్రిస్ట్‌గా కనిపించనున్నారు. హారర్ కామెడీగా మొదలయ్యే కథ, ఆయన ఎంట్రీతో ప్రేక్షకులు ఊహించని దిశగా సాగుతుందని మారుతి వెల్లడించారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా విడుదల కానుంది.



















