టాక్సిక్’ విడుదలకు ముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. యశ్ ప్రధాన పాత్రలో గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన టికెట్ ధరలను పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి.
ఏపీలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై రూ.50, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 వరకు అదనంగా వసూలు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. ఈ ధరలు జీఎస్టీతో కలిపి ఉండనున్నాయి. ఆగస్టు 26న ఉదయం 6 గంటలకు ప్రదర్శించే ప్రత్యేక ప్రీమియర్ షోకు టికెట్ ధరను రూ.600గా నిర్ణయించారు.
పెంచిన టికెట్ ధరలు విడుదలైన రోజు నుంచి పది రోజుల పాటు అమల్లో ఉండనున్నాయి. ఈ సమయంలో రోజుకు ఐదు షోలను ప్రదర్శించుకునేందుకు కూడా అనుమతి ఇచ్చారు. అదనంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ కమిటీకి రూ.కోటి డిపాజిట్ చేయాలని చిత్ర నిర్మాణ సంస్థ కేవీయన్ ప్రొడక్షన్స్‌కు సూచించారు.
‘టాక్సిక్’లో నయనతార, కియారా అడ్వాణీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హ్యుమా ఖురేషి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. యాక్షన్, థ్రిల్లర్ అంశాలతో గీతూ మోహన్‌దాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ప్రచార చిత్రాలను బట్టి తెలుస్తోంది.
కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ‘టాక్సిక్’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్ర నిడివి 3 గంటల 14 నిమిషాలు. భారీ తారాగణం, యశ్ క్రేజ్, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంపై ఉన్న అంచనాలతో సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















