బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా మరో విభిన్నమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పాత్ర నిడివి కంటే తెరపై తన పాత్ర ఎంత బలమైన ముద్ర వేస్తుందన్నదానికే ప్రాధాన్యం ఇచ్చే ఆయన.. వరుసగా వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటున్నారు. గతేడాది ‘ఛావా’లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుగా మెప్పించిన అక్షయ్.. ‘ధురంధర్’లో రెహమాన్ బలోచ్‌గా మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు. ఇప్పుడు పూర్తిగా భిన్నమైన పురాణ పాత్రలో కనిపించనున్నారు.
‘ఛావా’లో ఔరంగజేబు పాత్ర అక్షయ్ ఖన్నా కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచింది. ఎక్కువ సంభాషణలకు అవకాశం లేకపోయినా.. ముఖ కవళికలు, చూపులు, గంభీరమైన హావభావాలతో పాత్రకు బలాన్ని తీసుకొచ్చారు. సినిమాలో ఆయన కనిపించిన ప్రతి సన్నివేశం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేలా సాగింది.
‘ధురంధర్’లో రెహమాన్ బలోచ్‌గా అక్షయ్ ఖన్నా పూర్తిగా భిన్నమైన శైలిలో కనిపించారు. పాత్రలోని క్రూరత్వాన్ని, మేనరిజమ్స్‌ను తనదైన నటనతో ఆవిష్కరించారు. ముఖ్యంగా ఆయన ఎంట్రీ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. దీంతో ప్రధాన కథానాయకులతో సమానంగా ఆయన పాత్రకు కూడా ప్రాధాన్యం లభించింది.
ఇక ‘మహాకాళి’లో శుక్రాచార్యుడి పాత్రలో అక్షయ్ ఖన్నా కనిపించనున్నారు. పురాణాల ప్రకారం శుక్రాచార్యుడు అసురులకు గురువుగా, మార్గదర్శిగా కీలక పాత్ర పోషిస్తారు. దేవతలు, దానవుల మధ్య జరిగే పోరాటాల్లో అసురులకు వ్యూహాలు సూచించే శక్తిమంతమైన వ్యక్తిగా ఆయనను పురాణ కథనాలు వర్ణిస్తాయి.
తాజాగా విడుదలైన ‘శుక్రాచార్య వార్ క్రై’ వీడియోతో ఈ పాత్రపై ఆసక్తి మరింత పెరిగింది. అమృత మథనంలో దేవతలకే అమృతం దక్కిన అంశాన్ని ప్రశ్నిస్తూ అక్షయ్ చెప్పే సంభాషణ పాత్రలోని తీవ్రతను తెలియజేస్తోంది.
తెల్లటి గడ్డం, తీక్షణమైన కళ్లు, గంభీరమైన వేషధారణతో అక్షయ్ ఖన్నా కనిపించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇప్పటికే ఆయన లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుండగా.. సినిమాలో శుక్రాచార్యుడి పాత్ర కథను ఏ స్థాయిలో ప్రభావితం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















