కేజీఎఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటుడు యశ్.. సినీ ప్రయాణం అంత సులభంగా సాగలేదు. అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ‘యశ్’గా పేరు మార్చుకున్నారు. రంగస్థల నటుడిగా కెరీర్‌ను ప్రారంభించిన ఆయన.. ఒకప్పుడు సహ నటులకు టీలు అందించే పని కూడా చేశారు. రోజుకు రూ.50 సంపాదనతో మొదలైన ఆయన ప్రయాణం.. నేడు పాన్ ఇండియా స్టార్‌గా నిలిపింది.
టెలివిజన్ సీరియల్స్ ద్వారా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న యశ్.. 2007లో ‘జంబద హుడుగి’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ‘మొగ్గిన మనసు’ చిత్రంతో ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత ‘గూగ్లీ’, ‘మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి’ వంటి చిత్రాలు ఆయనకు కన్నడనాట భారీ స్టార్‌డమ్ తీసుకొచ్చాయి.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్: చాప్టర్ 1’ యశ్ కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. రాఖీ భాయ్ పాత్రలో ఆయన చూపించిన మాస్ ఇమేజ్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘కేజీఎఫ్: చాప్టర్ 2’తో ఆ క్రేజ్ మరింత పెరిగి ఆయన పాన్ ఇండియా స్టార్‌గా మారారు.
నటుడిగానే కాకుండా గాయకుడిగానూ యశ్ తన ప్రతిభను చాటుకున్నారు. ‘మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి’, ‘మాస్టర్‌పీస్’ చిత్రాల్లో పాటలు పాడారు. మరోవైపు నటి రాధికా పండిత్‌తో టీవీ సీరియల్స్‌లో నటిస్తున్న సమయంలో పరిచయం ఏర్పడింది. ఐదేళ్ల ప్రేమ తర్వాత వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి ఐరా, యథర్వ్ ఇద్దరు పిల్లలు.
సామాజిక సేవలోనూ యశ్ తన వంతు కృషి చేస్తున్నారు. ‘యశో మార్గ ఫౌండేషన్’ ద్వారా రైతులకు సహాయం చేస్తున్నారు. ప్రస్తుతం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగానూ అడుగులు వేస్తున్నారు. ‘రామాయణ’ చిత్రానికి కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో రావణుడి పాత్రలో కనిపించనున్నారు.
ఇలా చిన్న అవకాశాల నుంచి మొదలైన యశ్ ప్రయాణం.. కష్టపడి పనిచేస్తే ఎలాంటి స్థాయికి ఎదగవచ్చో చెప్పే స్ఫూర్తిదాయక ఉదాహరణగా నిలిచింది. ‘టాక్సిక్’ విడుదల నేపథ్యంలో మరోసారి యశ్ సినీ ప్రస్థానం, ఆయన సాధించిన విజయాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















