సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం, దారపనేని నరేంద్ర బాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన సంఘటన మర్చిపోనిలేనిది , న్యాయం కోసం నిలబడిన నాయకుడి పట్టుదలను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పింది ఆ సంఘటన. ఆయన కృషిలో అత్యంత ముఖ్యమైన అంశం – ప్రజలకు, పార్టీలో ఉన్నతాధికారులకు మధ్య శక్తివంతమైన వారధిలా పనిచేయడం.తన మీడియా సమన్వయంతో, ప్రజల అభిప్రాయాలు పార్టీకి, పార్టీ ఆశయాలు ప్రజలకు చేరడంలో ఆయన చూపే చొరవ అభినందనీయం. ఎన్ని ఒత్తిడులు, ఎన్ని వేధింపులు ఎదురైనా, అయన సిద్దాంతాల నుంచి, పార్టీ లక్ష్యం నుంచి ఎప్పుడు వెనకడుగు వేయకుండా, నిబ్బరంగా పోరాడిన ఆయన తెగువ ప్రశంసనీయం. ప్రజల గొంతుకగా నిలబడి, ఎన్ని కష్టాలు వచ్చినా నిలదొక్కుకుని, నేడు విజయం సాధించారు. దారపనేని నరేంద్ర బాబు గారి ధైర్యం, పార్టీ పట్ల ఆయనకున్న అపారమైన అభిమానం, నిజాయితీ అందరికీ స్ఫూర్తిదాయకం.


















