పెద్ద వ్యాపార సంస్థలకు జీఎస్‌టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర పన్ను అధికారులు ఉమ్మడి మార్గదర్శకాల రూపకల్పనపై కసరత్తు చేస్తున్నారు. నెలకు రూ.2.5 లక్షలకు పైగా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) పొందే పెద్ద సంస్థల రిజిస్ట్రేషన్ దరఖాస్తుల ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించడం ఈ ప్రతిపాదన ప్రధాన ఉద్దేశం.
ప్రస్తుతం కేంద్ర జీఎస్‌టీ, రాష్ట్ర పన్ను విభాగాల మధ్య పెద్ద సంస్థల నుంచి కోరే పత్రాల విషయంలో ఏకరూపత లేదని అధికారులు తెలిపారు. దీంతో పన్ను చెల్లింపుదారుల్లో అయోమయం, అనిశ్చితి నెలకొంటోందని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రం ఆమోదించిన తర్వాత ఈ ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే జీఎస్‌టీ మండలి సమావేశం ముందు ఉంచనున్నట్లు వెల్లడించారు.
బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన నేషనల్ ట్యాక్సేషన్ సమిట్‌లో సీబీఐసీ సభ్యుడు (జీఎస్‌టీ) సంజయ్ మంగళ్ ఈ వివరాలను వెల్లడించారు.
పెద్ద వ్యాపారాల జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ప్రస్తుతం వివిధ పన్ను విభాగాలు వేర్వేరు పత్రాలను కోరుతున్న పరిస్థితి ఉంది. దీనికి పరిష్కారంగా దేశవ్యాప్తంగా ఒకే విధమైన సర్క్యులర్ లేదా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ) తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు.
ఇది అమల్లోకి వస్తే పన్ను అధికారులు, వ్యాపార సంస్థలకు అవసరమైన పత్రాలు, ప్రక్రియపై స్పష్టత ఏర్పడటంతో పాటు దరఖాస్తుల పరిశీలన వేగవంతమయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1.68 కోట్ల వ్యాపార సంస్థలు జీఎస్‌టీ కింద నమోదై ఉన్నాయి. చిన్న, తక్కువ రిస్క్ ఉన్న వ్యాపారాల కోసం తీసుకొచ్చిన సరళీకృత విధానం ద్వారా ఇప్పటికే 65 శాతం రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. మిగిలిన 35 శాతం పెద్ద వ్యాపారాల దరఖాస్తుల ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ప్రతిపాదిత కొత్త వ్యవస్థ దోహదపడనుంది.
జీఎస్‌టీ రిజిస్ట్రేషన్ రద్దుకు సంబంధించిన నిబంధనలను కూడా అధికారులు క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏయే పరిస్థితుల్లో వ్యాపార సంస్థ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయవచ్చనే అంశాలను స్పష్టంగా నిర్వచించడంతో పాటు.. రద్దు ప్రక్రియను ఆటోమేట్ చేసే అవకాశాలపైనా చర్చలు జరుగుతున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















