బ్రిక్స్ కూటమి సమావేశాలకు విశాఖపట్నం వేదికగా నిలవనుంది. బ్రిక్స్ దేశాల యువజన, క్రీడాశాఖ మంత్రుల సమావేశం శని, ఆదివారాల్లో నగరంలో జరగనుంది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. భారత్‌తో పాటు బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేసియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యూఏఈ దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు.
విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత, యువత సంక్షేమం, సుస్థిరాభివృద్ధి తదితర అంశాలపై ప్రతినిధులు చర్చించనున్నారు. బ్రిక్స్ దేశాల మధ్య యువతకు సంబంధించిన కార్యక్రమాలు, పరస్పర సహకారాన్ని మరింత విస్తరించే అంశాలపైనా అభిప్రాయాలను పంచుకోనున్నారు.
విదేశీ ప్రతినిధులు శుక్రవారం విశాఖకు చేరుకున్నారు. వారికి అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. నగరంలోని నొవొటెల్, రాడిసన్ బ్లూ హోటళ్లలో ప్రతినిధుల బసకు ఏర్పాట్లు చేశారు. సమావేశాల నేపథ్యంలో నగరంలో భద్రత, రవాణా, అతిథుల సౌకర్యాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
బ్రిక్స్ దేశాల ప్రతినిధులు శనివారం ఉదయం తొట్లకొండలో మొక్కలు నాటనున్నారు. అనంతరం రాడిసన్ బ్లూ హోటల్‌లో జరిగే యువజన, క్రీడా మంత్రుల సమావేశంలో పాల్గొంటారు. యువత అభివృద్ధి, క్రీడల ప్రోత్సాహం, నైపుణ్య శిక్షణ తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.
శనివారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నొవొటెల్ హోటల్‌లో బ్రిక్స్ దేశాల ప్రతినిధులకు విందు ఇవ్వనున్నారు. ఆదివారం ఉదయం బీచ్‌రోడ్డులోని నొవొటెల్ హోటల్ నుంచి సబ్‌మెరైన్ మ్యూజియం వరకు ప్రతినిధులతో కలిసి స్నేహపూర్వక సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రి రుషికొండ తీరంలో విందు ఏర్పాటు చేయనున్నారు.
మరోవైపు చెన్నైలో బ్రిక్స్ సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ (ఎస్‌టీఐ) సమావేశం శుక్రవారం ప్రారంభమైంది. 2026లో బ్రిక్స్ కూటమికి భారత్ అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం’ అనే ఇతివృత్తంతో భారత్ సమావేశాలను నిర్వహిస్తోంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయ సహకారం ద్వారా ఆవిష్కరణలను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరాన్ని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ వివరించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















