ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్నవూలో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను ఆమె పనిచేస్తున్న కార్యాలయం వద్దే తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం ఇంటికి వెళ్లి తన సోదరిపై కాల్పులు జరిపి హతమార్చాడు. ఆ తర్వాత తనపై తాను కాల్పులు జరుపుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పోలీసులు నిందితుడిని మానస్ వాజ్‌పేయిగా గుర్తించారు. అతడు ఎస్‌బీఐలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపారు. తొలుత మానస్ తన భార్య దివ్య పనిచేస్తున్న ఐసీసీఐ బ్యాంకు వద్దకు వెళ్లి ఆమెను బయటకు పిలిచాడు. ఇద్దరూ కొన్ని నిమిషాల పాటు మాట్లాడుకున్న అనంతరం దివ్యపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు.
తీవ్రంగా గాయపడిన దివ్యను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు.
అనంతరం మానస్ ఇంటికి చేరుకుని తన సోదరిపై కూడా కాల్పులు జరిపాడు. ఆమె అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత మానస్ తనపై తాను కాల్పులు జరుపుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
ఆత్మహత్యకు ముందు మానస్ వాట్సాప్‌లో ఓ స్టేటస్ పెట్టినట్లు పోలీసులు తెలిపారు. తన భార్య తనను మోసం చేసిందని, ఆమెను చంపానని.. అనంతరం సోదరిని కూడా చంపి తాను చనిపోతానని అందులో పేర్కొన్నట్లు సమాచారం. తన భార్య సోదరి ప్రజ్ఞ, భరత్‌కు ఈ వ్యవహారంపై అన్ని విషయాలు తెలుసంటూ స్టేటస్‌లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
ఈ వాట్సాప్ స్టేటస్‌ను చూసిన ఓ పొరుగింటి వ్యక్తి అప్రమత్తమై మానస్ ఇంటికి వెళ్లాడు. అక్కడ మానస్, అతడి సోదరి విగతజీవులుగా కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం.. మానస్, దివ్యలకు 12 ఏళ్ల క్రితం వివాహమైంది. గతేడాది దివ్య విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దంపతుల మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















