నిజామాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని నమోదు చేసింది. 25 వేలకుపైగా మెజార్టీతో పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు. ఈ సందర్భంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.
“జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి మద్దతు తెలిపారు. ఈ విజయం కోసం శ్రమించిన ప్రతి కార్యకర్తకూ ఇది అంకితం. జూబ్లీహిల్స్ తీర్పుతో ప్రజలు BRSకు గుడ్‌బై చెప్పారు. ఆ పార్టీకి రాష్ట్రంలో స్థానం లేదని మరోసారి స్పష్టమైంది. ఇక ముందూ ప్రజల ఆశల ప్రకారం మంచి పాలన కొనసాగుతుంది. నవీన్ విజయంలో ముఖ్య భూమిక ముఖ్యమంత్రి, మంత్రులు మరియు ప్రతి కాంగ్రెస్ కార్యకర్తదే” అంటూ మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు.




















