సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు Allu Arjunకు నాంపల్లి కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీ (సోమవారం) విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.
ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను ఏ11గా చేర్చారు. ఏ1 నుంచి ఏ10 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం, సిబ్బంది నిందితులుగా ఉన్నారు. ఇప్పటివరకు 19 మందికి సమన్లు జారీ అయ్యాయి. నిందితుల వ్యక్తిగత హాజరు అనంతరం కేసు విచారణ ప్రారంభం కానుంది.
పోలీసులు మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చి ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలు చేశారు. 2024 డిసెంబర్ 4న ‘పుష్ప-2’ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అదే ఏడాది డిసెంబర్ 13న అల్లు అర్జున్‌ను అరెస్టు చేయగా, అనంతరం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన షూటింగ్ నిమిత్తం ముంబయిలో ఉన్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.
అలాగే ఈ కేసు విషయంలో ఊహాగానాలు, అసత్య ప్రచారాలను నివారించాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మీడియా, సోషల్ మీడియాపై గ్యాగ్ ఆర్డర్ జారీ చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఎలాంటి ఊహాజనిత కథనాలు ప్రచురించరాదని స్పష్టం చేసింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















