అసాధారణంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో తెలంగాణ రాష్ట్రం తీవ్ర ఉక్కపోతకు లోనవుతోంది. శుక్రవారం రోజున వేడి, ఉక్కపోత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో భగభగల తీవ్రత మరింత పెరిగింది.
రాష్ట్రంలోని 17 జిల్లాల పరిధిలో మొత్తం 59 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీచినట్లు వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 6 నుంచి 7 డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండంలో సాధారణంగా 34.9 డిగ్రీలు ఉండాల్సిన ఉష్ణోగ్రత 41.9 డిగ్రీలకు పెరిగింది. నిజామాబాద్‌లో 41.3 డిగ్రీలు, మెదక్‌లో 40 డిగ్రీలు, హనుమకొండలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవన్నీ సాధారణం కంటే గణనీయంగా అధికంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
అలాగే రాష్ట్రంలోని మరో 116 మండలాల్లో కూడా వడగాలులు వీచినట్లు సమాచారం. అత్యధికంగా మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో 10 మండలాలు, పెద్దపల్లిలో 9 మండలాలు, హైదరాబాద్ మరియు కామారెడ్డి జిల్లాల్లో 8 మండలాల్లో తీవ్ర వడగాలులు నమోదయ్యాయి.
మహబూబ్‌నగర్‌లో సాధారణం కంటే 5.3 డిగ్రీలు, ఖమ్మంలో 4.5 డిగ్రీలు, హైదరాబాద్‌లో 4.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాబోయే రెండు రోజులు కూడా రాష్ట్రంలో వడగాలులు కొనసాగనున్నాయి. శని, ఆదివారాల్లో ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేశారు.
కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన స్వల్ప వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















