శ్రావణ మాసం చివరి శుక్రవారం, వరలక్ష్మీ వ్రత పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. పలు జిల్లాల్లోని ఆలయాలు ప్రత్యేక అలంకరణలతో శోభాయమానంగా మారాయి.
అమ్మవారిని కూరగాయలు, కరెన్సీ నోట్లు, పసుపు కొమ్ములు, పూలు, పండ్లతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి అలంకరణలను చూసేందుకు, దర్శనం చేసుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చారు.
మరోవైపు మహిళలు సంప్రదాయబద్ధంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు, వ్రత కథా పారాయణం, మంగళహారతులతో ఆలయాలు, ఇళ్లు భక్తిభావంతో నిండిపోయాయి. వరలక్ష్మీదేవిని దర్శించుకుని కుటుంబ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని భక్తులు ప్రార్థించారు.
శ్రావణ శుక్రవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో కనిపించిన ఆధ్యాత్మిక, పండుగ వాతావరణానికి సంబంధించిన ప్రత్యేక ఫొటోలు ఇవిగో
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















