కర్నూలు జిల్లాలో జరిగిన భయానక బస్సు ప్రమాదం పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిపై సానుభూతి ప్రకటిస్తూ, అవసరమైన సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు.
ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నారు. రాష్ట్ర సీఎస్, డీజీపీతో సమీక్ష నిర్వహించి, హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా గద్వాల కలెక్టర్, ఎస్పీ ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలను సమన్వయం చేయాలని ఆదేశించారు.
శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు సమీపంలో బైక్‌ను ఢీకొనడంతో మంటలు చెలరేగి పెద్ద అగ్నిప్రమాదం జరిగింది. ఈ దారుణ ఘటనలో 19 మంది సజీవ దహనమవడం తీవ్ర విషాదాన్ని కలిగించింది.




















