పేదలకు ఇళ్లు కల్పించడంతో పాటు వారి జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. జనావాసాలకు, పని ప్రదేశాలకు దూరంగా ఇళ్లను నిర్మిస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. అందుకే ‘క్యూర్’ పరిధిలో పని ప్రదేశాలకు సమీపంలోనే ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని అధికారులను ఆదేశించారు.
తొలిదశలో 17 నియోజకవర్గాల్లో 7,680 ఫ్లాట్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఒక్కో ఫ్లాట్ సుమారు 528 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో నిర్మించనున్నారు. ఒక్కో ఫ్లాట్ నిర్మాణానికి దాదాపు రూ.11 లక్షలు ఖర్చవుతుండగా, ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ అందించనుంది. మిగిలిన రూ.6 లక్షలు లబ్ధిదారుడి వాటాగా ఉండనుండగా, భూమి ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది.
ఔటర్ రింగ్‌రోడ్డు లోపల వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన నిరుపయోగ స్థలాలను గుర్తించి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వినియోగించాలని సీఎం అధికారులకు సూచించారు. పేదలకు సొంత ఇల్లు అందించడంతో పాటు వారికి సమీపంలోనే ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉండేలా సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని ఆయన స్పష్టం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















