గత భారాస ప్రభుత్వ హయాంలో పేదల సమస్యలను పట్టించుకునే వారే కరవయ్యారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి పేదలను మోసం చేశారని ఆరోపించారు. గతంలో ‘క్యూర్’ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
గాంధీభవన్‌లో నిర్వహించిన ‘ప్రజలతో ముఖాముఖి’ కార్యక్రమంలో మంత్రి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రెవెన్యూ, భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లకు సంబంధించి దాదాపు 400 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. భూ సమస్యలపై పలు జిల్లాల కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడి, నిబంధనల ప్రకారం సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.
పేదలకు వారు పుట్టి పెరిగిన ప్రాంతంలోనే నివాస సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని ‘ఇందిరమ్మ టవర్స్’ నిర్మించనున్నట్లు పొంగులేటి తెలిపారు. లబ్ధిదారులకు ఇంటి స్థలంలో అన్ డివైడెడ్ షేర్ కూడా కల్పిస్తామని, దాని విలువ రూ.40 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉండవచ్చని చెప్పారు. పైలట్ ప్రాజెక్టుగా 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















