తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం చల్లబడింది. గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. నైరుతి దిశ నుంచి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్లు పేర్కొంది.
గత రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు కాళేశ్వరంలో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లోనూ బుధవారం పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి.
ఈ వానాకాలంలో జూన్ 1 నుంచి జులై 22 వరకు రాష్ట్ర సగటు వర్షపాతం సాధారణం కంటే 24 శాతం తక్కువగా ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 60 శాతం వర్షపాతం లోటు నమోదైంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పలు జిల్లాల్లో వర్షపాతం లోటు కొంతవరకు తగ్గే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















