హాంగ్‌ఝౌలో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో భారత యువ షూటర్ ఇషా సింగ్ అద్భుత ప్రతిభ కనబరిచింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో అగ్రశ్రేణి ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో 40 హిట్స్‌తో ఇషా సింగ్ విజేతగా నిలిచి భారత కీర్తిని చాటింది.
ఫైనల్లో ఇషా సింగ్ నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకోగా.. ఒలింపిక్ పతక విజేత మనూ బాకర్ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. షూట్ ఆఫ్ దశను దాటుకుని వచ్చిన మనూ బాకర్ 28 హిట్స్‌తో మూడో స్థానంలో నిలిచింది. అంతకుముందు జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లోనూ భారత షూటర్లు సత్తా చాటారు. మనూ బాకర్ 586-20x స్కోరుతో అగ్రస్థానంలో నిలవగా.. 21 ఏళ్ల ఇషా సింగ్ 585-18x స్కోరుతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. అయితే ఫైనల్లో తన అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్న ఇషా సింగ్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుని భారత అభిమానుల్లో ఆనందం నింపింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















