పిల్లలు అర్ధాకలితో పాఠశాలలకు వెళ్లకూడదనే ఉద్దేశంతో అల్పాహార పథకాన్ని ప్రారంభించామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా మధిరలో పర్యటించిన ఆయన మార్కెట్ యార్డులో హరేరామ హరేకృష్ణ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ కిచెన్‌ను ప్రారంభించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు స్వయంగా అల్పాహారం అందించి, వారితో కలిసి భోజనం చేశారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. విద్యార్థులు ఉదయం ఆకలితో పాఠశాలకు వెళ్లకుండా, ఆరోగ్యకరమైన వాతావరణంలో చదువుపై దృష్టి పెట్టేలా అల్పాహార పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 27 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం అందించడం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం, విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















