హైదరాబాద్: తెలంగాణ మాజీ క్రికెటర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మహమ్మద్ అజహరుద్దీన్ (Mohammad Azharuddin)కు మంత్రి పదవి దక్కింది. రాబోయే రెండు రోజులలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగనుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగా అజహరుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు ఎఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గంలో కొత్త పేర్లను ఖరారు చేసే దిశగా సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే హైకమాండ్‌తో చర్చలు జరిపినట్లు తెలిసింది. ఈ క్రమంలో మాజీ భారత క్రికెట్ కెప్టెన్‌గా, అలాగే కాంగ్రెస్ సీనియర్ నేతగా అజహరుద్దీన్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయనకు అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం.
మాజీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా అజహరుద్దీన్ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. క్రీడా రంగంలో ఆయన అనుభవం, ప్రజల్లో ఉన్న గుర్తింపు పార్టీకి ప్లస్‌గా మారుతుందని కాంగ్రెస్ భావిస్తున్నది. ఎల్లుండి జరిగే మంత్రివర్గ విస్తరణలో ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.




















