ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులు, స్టేషన్ల అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైల్వే అధికారులతో విస్తృతంగా చర్చించారు. రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఏపీని దేశానికి బెంచ్‌మార్క్‌గా నిలపాలని ఆయన సూచించారు. అలాగే రాజధాని అమరావతిని దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలతో కలిపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
అమృత్ పథకం కింద ఎంపికైన రాష్ట్రంలోని 73 రైల్వే స్టేషన్లను 2027 నాటికి పూర్తిగా అభివృద్ధి చేయాలని సీఎం తెలిపారు. రాష్ట్రంలో ఏర్పడుతున్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను ప్రధాన రైల్వే మార్గాలతో అనుసంధానం చేస్తే వాణిజ్యం, రవాణా మరింత వేగవంతం అవుతుందని పేర్కొన్నారు. మూలపేట, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం పోర్టులకు రైల్వే లైన్లు కలపాలని సూచించారు.
తిరుపతి–రేణిగుంట ప్రాంతం పారిశ్రామిక హబ్‌గా మారుతున్న నేపథ్యంలో, అక్కడి పరిశ్రమలను ప్రధాన రైల్వే మార్గాలతో కలపడం ద్వారా సరుకుల రవాణా తక్కువ ఖర్చుతో సాధ్యమవుతుందని సీఎం తెలిపారు. ఇచ్ఛాపురం నుంచి తడ వరకు నాలుగు వరుసల రైల్వే లైన్ల నిర్మాణానికి వచ్చే మూడేళ్లలో డీపీఆర్ సిద్ధం చేయాలని రైల్వే అధికారులను ఆదేశించారు.
రైల్వే ప్రాజెక్టులకు అవసరమైన భూమి కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం స్పష్టం చేశారు. అలాగే విశాఖ, విజయవాడ, గుంతకల్, గుంటూరు, రేణిగుంట వంటి ప్రధాన జంక్షన్లలో రద్దీ తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అమరావతిని కలుపుతూ ఎర్రుపాలెం–నంబూరు కొత్త రైల్వే లైన్‌ను త్వరగా నిర్మించాలని, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలతో రాజధానిని నేరుగా అనుసంధానించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















