అమెరికా–ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో, Mojtaba Khamenei కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సీజ్‌ఫైర్ యుద్ధానికి ముగింపు కాదని స్పష్టంచేస్తూ, ఇరాన్ ఇంకా అప్రమత్తంగానే ఉందని హెచ్చరించారు.కల్పుల విరమణ అనంతరం విడుదల చేసిన ప్రకటనలో, “ఇది యుద్ధం ముగింపు కాదు. మా వేళ్లు ఇంకా ట్రిగ్గర్‌పైనే ఉన్నాయి. ఎలాంటి దురాక్రమణ జరిగినా పూర్తి శక్తితో ప్రతిస్పందిస్తాం” అని తెలిపారు. అదే సమయంలో అన్ని సైనిక విభాగాలు తక్షణమే కాల్పులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.
ఇక Donald Trump, పాకిస్థాన్ ప్రధాని Shehbaz Sharif ప్రతిపాదన మేరకు రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ప్రకటించారు. Iran హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఒప్పుకున్నందున, ఆ ప్రాంతంలో దాడులు నిలిపివేస్తామని తెలిపారు.
శాశ్వత శాంతి ఒప్పందానికి దారితీసే అవకాశం ఈ గడువు కల్పిస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. హర్మూజ్‌పై నియంత్రణ కొనసాగించడం, ఆంక్షల సడలింపు, భద్రతా హామీలు వంటి 10 పాయింట్ల ప్రతిపాదనలను Iran ముందుంచినట్లు తెలిపారు.ఇక కాల్పుల విరమణ నేపథ్యంలో, ఇస్లామాబాద్‌లో ప్రత్యక్ష చర్చలకు రావాలని Shehbaz Sharif పిలుపునిచ్చారు. ఈ నెల 10న చర్చలకు రావాలని ఇరు దేశాల ప్రతినిధి బృందాలను ఆహ్వానించారు. దీనిపై వైట్ హౌస్ స్పందిస్తూ, చర్చలపై సంప్రదింపులు కొనసాగుతున్నాయని, తుది నిర్ణయం అధ్యక్షుడిదేనని పేర్కొంది.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















