Gujaratలో సంచలనానికి దారితీసిన హత్యకేసు వెలుగులోకి వచ్చింది. ప్రేమ, మోసం, వివాహేతర సంబంధాలు, హత్య కుట్రలతో నిండిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
పోలీసుల వివరాల ప్రకారం.. జాగృతి అనే మహిళకు కొన్నేళ్ల క్రితం సుఖ్‌దేవ్‌గిరితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొంతకాలానికి ఆమె భర్త సోదరుడు శాంతిగిరి గోస్వామితో ప్రేమలో పడింది. అనంతరం భర్త, పిల్లలను వదిలేసి మరో గ్రామానికి వెళ్లి శాంతిగిరిని రెండో పెళ్లి చేసుకుంది.అక్కడితో ఆగకుండా.. ట్రక్ డ్రైవర్‌గా పనిచేసే రెండో భర్త ఇంట్లో లేని సమయంలో కాంతిలాల్ అలియాస్ భరత్ సబారియాతో వివాహేతర సంబంధం కొనసాగించింది. రెండో భర్త తమ బంధానికి అడ్డుగా మారడంతో అతడిని హత్య చేయాలని కుట్ర పన్నారు.
ఈ క్రమంలో యూనస్ అనే వ్యక్తికి రూ.25 వేల సుపారీ ఇచ్చారు. అయితే అతడు భయపడి హత్య చేయకుండా.. నిద్రలో ఉన్న శాంతిగిరి ఫొటో తీసి హత్య చేశానని నమ్మబలికి డబ్బులతో పరారయ్యాడు.తర్వాత జాగృతి, ఆమె ప్రియుడు కాంతిలాల్ కలిసి శాంతిగిరిని ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం ప్రమాదంగా చిత్రీకరించేందుకు దీపక్ అనే మరో వ్యక్తి సహాయం తీసుకున్నారు.
ముగ్గురూ కలిసి మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి సురేంద్రనగర్ సమీపంలోని కాలువలో పడేశారు. భర్త ఎక్కడున్నాడని అడిగిన వారికి.. కొత్త ఉద్యోగంలో చేరాడని, ఫోన్ నంబర్ మార్చుకున్నాడని జాగృతి చెబుతూ వచ్చింది.గత ఏడాది అక్టోబరులో కాలువలో మృతదేహం లభించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో అసలు కుట్ర బయటపడటంతో జాగృతి, కాంతిలాల్‌ను అరెస్టు చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















