ఐఫోన్లు మరియు ఆండ్రాయిడ్ పరికరాల మధ్య జరిగే రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ (RCS) చాట్స్‌కు భారీ ప్రైవసీ అప్డేట్ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం, Apple తన iOS 18 తర్వాత తీసుకువచ్చిన RCS సపోర్ట్‌ను మరింత అభివృద్ధి చేస్తూ iOS 26.5 అప్డేట్లో ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఇప్పటివరకు Android మరియు ఐఫోన్ల మధ్య RCS మెసేజింగ్‌లో టైపింగ్ ఇండికేటర్లు, రీడ్ రిసీప్ట్స్, హై క్వాలిటీ మీడియా షేరింగ్ వంటి ఫీచర్లు మాత్రమే ఉండేవి. కానీ గోప్యత పరంగా పూర్తి రక్షణ లేకపోవడం పెద్ద లోపంగా భావించబడింది.
కొత్త అప్డేట్తో మెసేజ్‌లు పూర్తిగా ఎన్‌క్రిప్ట్ అవుతాయి. అంటే పంపిన వ్యక్తి మరియు స్వీకరించిన వ్యక్తి మాత్రమే మెసేజ్‌లను చదవగలరు. మధ్యలో Google లేదా టెలికం సర్వీసులు కూడా కంటెంట్‌ను యాక్సెస్ చేయలేవు.ఈ ఎన్క్రిప్షన్ వల్ల iPhone మరియు Android యూజర్ల మధ్య మెసేజింగ్ మరింత సురక్షితంగా మారనుంది. చాట్స్‌లో తాళం గుర్తుతో పాటు “RCS Encrypted” అనే సూచన కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది బీటా దశలో ఉండగా, త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















